Tuesday, January 11, 2011

నేను తల్చుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది : జగన్


AA

 
ప్రభుత్వాన్ని కూల్చడం నా అభిమతం కాదు - జగన్‌ 
  నా మద్దతుదారులు కొత్త పార్టీ తరపున పోటిచేస్తారు - జగన్‌


తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తల్చుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని, అయితే అది తన అభిమతం కాదని యువనేత జగన్‌ అన్నారు. జలదీక్ష సందర్బంగా ఢిల్లీలో నేషనల్‌ మీడియాతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తన మద్దతుదారులు కొత్త పార్టీ తరపున బరిలో దిగుతారని ఆయన స్పష్టం చేశారు.

వై యస్ జగన్ పై బాబు నిప్పులు..


విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై, దివంగత నేత వైయస్సార్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. మన దేశంపై దండెత్తి వచ్చిన గజనీలు కేవలం బంగారాన్ని, డబ్బునే దోచుకు పోయారని కాని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మాత్రం చివరకు భూమిలో ఉన్న ఖనిజాలను కూడా దోచుకున్నారని ఆయన మంగళవారం కృష్ణా జిల్లాలో కైకలూరు పర్యటనలో విమర్శించారు. వైయస్ తన హయాంలో కొల్లేరు ప్రాంతంలో 7500 ఎకరాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారన్నారు. వైయస్ తీవ్ర అవినీతికి పాల్పడితే కొడుకు జగన్ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఢిల్లీలో దీక్ష చేయకుండా అవినీతికి పాల్పడిన వైయస్ సమాధి వద్ద చేయాలని జగన్‌కు సూచించారు.

అక్రమంగా స్వాధీనం చేస్కున్న పేదల భూములను వారికి ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ వారి తరఫున పోరాడుతుందన్నారు. రైతులకు ధైర్యం చెప్పడానికి, కష్టాలు తెలుసుకోవడానికే తాను వచ్చనన్నారు. పేదలపై ప్రభుత్వం ఆటలు సాగనివ్వమన్నారు. సమాజంలో అవినీతి పెరిగితే సమస్యలు వస్తాయన్నారు. పేదల పేదలుగానే ఉండిపోవడానికి పెద్దలు మాత్రం మరింత ఆస్తులు కూడబెట్టుకోవడానికి కారణం అవినీతి అన్నారు. కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డికి వైయస్ అక్రమంగా వేల కోట్ల రూపాయల విలువ చేసే ఖనిజాన్ని కట్టబెట్టారని, ఆ ధనంతో ఆయన ఎంపీలను, ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు.

రోడ్లు వేయించింది విగ్రహాలు పెట్టుకోవడానికి కాదని, ప్రయాణం చేయడానికి అని జగన్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న వైయస్ విగ్రహాలనుద్దేశించి అన్నారు. 2జి స్పెక్ట్రం, కామన్వెల్తు కుంభకోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్లు అవినీతికి పాల్పడిందన్నారు. కాని పేదలను ఆదుకోవడానికి మాత్రం వెనుకాడుతుందన్నారు. పేదల అభివృద్ధికి పాల్పడింది ఒక్క తెలుగుదేశం పార్టీయే నన్నారు. కొల్లేరు మత్స్యకారులను న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన చెప్పారు. వైయస్ ఆపరేషన్ కొల్లేరు తర్వాత 40 శాతం మందికి పైగా మత్స్యకారులు వలస వెళ్లి దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. కొల్లేరు రైతుల న్యాయం కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతామని చెప్పారు. రాష్ట్రంలో రైతులు, కొల్లేరు మత్స్యకారులు తీవ్ర నష్టాల్లో ఉన్నారన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు కారణంగా కైకలూరుకు నీరు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. దేవేగౌడకు అలమట్టి కట్టవద్దని తాను చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. దళితులకు, బీసీలకు రాజకీయ గుర్తింపునిచ్చింది తెలుగుదేశం పార్టీయేనన్నారు.

Monday, January 10, 2011

సెమీ న్యూడ్ అయినా రెడి..!



ఆరెంజ్ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన షాజన్ పదంసి తాను బికినీవేయటానికైనా లేదా సెమీ న్యూడ్ గా కనిపించాలన్నా కూడా అభ్యంతరం లేదంటోంది. ఎక్స్‌పోజింగ్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అని మీడియా వారు ప్రశ్నించినప్పుడు ఇలా స్పందించింది. అలాగే ఎక్స్‌పోజింగ్ విషయంలో నాకు ఎలాంటి నిబంధనలు లేవు. లిప్ టు లిప్‌ కిస్ నుంచీ టూ పీస్ బికినీ వరకూ, ఆ మాటకొస్తే సెమీ న్యూడ్.. కూడా నేను సిద్దమే.అవి కూడానటనలో భాగమే కదా. కాకపోతే కమర్షియల్ యాంగిల్ కోసమైతే నేను ఒప్పుకోను. అదే సినిమాలో సన్నివేశం డిమాండ్ చేస్తే అభ్యంతరం లేదు అంటోంది షాజన్. ఎటువంటి ఎక్స్‌పోజింగ్‌కైనా రెడి అంటున్న ఆమెకు త్వరలో తెలుగులో అవకాశాలు వచ్చే వాతావరణం కనపడుతోంది. ఆరెంజ్ తర్వాత ఆఫర్స్ గురించి చెపుతూ... ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా వున్నాను. తెలుగు నుంచీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నాకు నచ్చిన కథలు, పాత్రలు ఇప్పటి వరకు ఎవ్వరూ నా దగ్గరికి తీసుకు రాలేదు. హిందీ సినిమాల నుంచి ఖాళీ దొరికినప్పుడు తెలుగు సినిమాల గురించి ఆలోచిస్తాను అంది.

తెలంగాణకు "హైదరాబాదే" రాజధాని


AA


*మనస్సులో మాట బయటపెట్టిన కేకే

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణాకు అనుకూలమే అంటున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేకే. ఐదో సూచనను తామంతా ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ రాజధానిగా తాము తెలంగాణను కోరుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి విభేధాలు లేవన్న ఆయన రేపు సికింద్రాబాద్‌ కేజేఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌తో కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డిని ఆహ్వానించినట్లు వెల్లడించారు.

ఆ ఫేస్ బుక్ అకౌంట్ నాది కాదు : కాజల్


కాజల్ పేరిట ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్ లోనూ ఉన్న ఎకౌంట్స్ కీ తనకీ సంభందం లేదంటోంది కాజల్. అలాగే భవిష్యత్ లో కూడా తాను ఎటువంటి ఎకౌంట్ ఓపెన్ చేసి రాస్తానని ఎక్సపెక్ట్ చేయవద్దు అంటోందామె. రీసెంట్ గా ఆమె మీడియాతో మాట్లాడుతూ..."చిన్నప్పుడు పరీక్షల్లో రాయడం తప్ప వేరే ఏమీ రాయటం నాకు అలవాటు లేదు. అయినా కంటిన్యూగా అలా రాసుకుంటూ పోవాలంటే భలే బోరు..అందుకే ట్విట్టర్‌ లు, ఫేస్ ‌బుక్ ‌లలోనూ నేనెప్పుడూ ఏమీ రాయను. అసలు వాటిలో నాకు ఎకౌంట్ కూడా లేదు. ఓపెన్ కూడా చేయను. వీటితో పాటు ఎస్ ఎమ్ ఎస్ ‌లను కూడా చాలా అరుగుదానే పంపుతుంటాను అని తేల్చేసింది కాజల్. కాజల్ రీసెంట్ గా తధాస్తు అనే చిత్రం ఓకే చేసింది. అయితే ఆ చిత్రం కన్నడంలో నిర్మాణమవుతుంది. ప్రస్తుతం తెలుగులో మూడు, తమిళంలో రెండు చిత్రాల్తో బిజీగావున్న కాజల్‌ త్వరలోనే 'తథాస్తు' షూటింగ్‌ లో పాల్గొంటుందని తెలుస్తోంది. ప్రభాస్ సరసన దశరధ్ దర్శకత్వంలో వచ్చే చిత్రంలో బిజీగా ఉంది.

ఒంటరితనం భరించలేకే అలా..! : తమన్నా





"నాకు ఇంటిమీద బెంగ ఎక్కువ. వారం రోజులకు ఒకసారి ఇంటికి వెళ్ళకపోతే అసలేమీ తోచదు.అయితే షూటింగ్‌ల నిమిత్తం ఎక్కువగా దక్షిణాదినే ఉంటున్నా. కానీ నన్ను ఒంటిరితనం భాధిస్తోంది. అందుకే ఇక్కడ ఇల్లు కూడా సొంతంగా తీసుకోలేదు. అమ్మ, నాన్నలను వదిలిపెట్టి ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను. ఎంత బిజీగా ఉన్నా ముంబై వెళ్ళి నా ఫ్రెండ్స్‌ని, ఇంటిని ఓ సారి చూసిరానిదే మనసు కుదుటపడట్లేదు అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. అలాగే తనకీ, తమిళ హీరోకి కార్తీకి రిలేషన్ ఉన్నట్లు రాస్తున్నారని,అది తెర వరకే నని గుర్తు పెట్టుకోవాలని అంది.అలాగే నాకున్న మంచి ఫ్రెండ్స్ కేవలం..పూనమ్ బజ్వా, వేదిక. వీరిద్దరిని కలిస్తే చాలు...అల్లరల్లరి చేసేస్తాను. నా గురించి తెలిసిన మంచి ఫ్రెండ్స్ వీరిద్దరు అంది. కావాలని పనిగట్టుకుని మరీ కార్తీకి తనకూ ఏ విధమైన రిలేషన్ లేదని ఎస్టాబ్లిష్ చేయటానికే ఆమెఈ కబర్లు చెప్తోందంటున్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో అల్లు అర్జున్ తో బద్రీనాథ్ చిత్రంలో మరియు సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య సరసన నటిస్తోంది.

2జిస్పెక్ట్రమ్‌పై కేంద్రానికిసుప్రీం నోటీసు




న్యూఢిల్లీ: మాజీ టెలికం మంత్రి ఎ. రాజా జమానాలో జరిగిన 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి, టెలికం మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. కాగ్ నివేదికను కపిల్ సిబల్ ఎలా తప్పు పడుతారని, కాగ్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయాలని సివిసి సిబిఐని ఆదేశించిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. రాజా హయాంలో జరిగిన 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి, న్యాయవాది ప్రశాంత్ భూషన్ ఆ పిటిషన్లను దాఖలు చేశారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్వామి విజ్ఞప్తిని గత వారం సుప్రీంకోర్టు సమర్థించింది.

Sunday, January 9, 2011

జగన్ పై విమర్శలు చేసే స్థాయి 'DL' కు లేదు


AA

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై ద్వేషంతోనే మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చేతనైతే ప్రభుత్వాన్ని పడకొట్టాలని జగన్ కు సవాలు విసిరుతున్నారని ఆ వర్గం నేత గట్టు రాంచంద్రరావు అనుమానం వ్యక్తం చేశారు. జగన్ పై విమర్శలు చేసే స్థాయి డీఎల్ కు లేదని ఆయన అన్నారు. జగన్ డిల్లీలో చేపట్టనున్న దీక్షలో ఎమ్మెల్యేలు పాల్గొనకుండా సీఎం అడ్డుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అతి త్వరలో క్యాబినెట్‌ మార్పులు చేర్పులు

అవినీతి ప్రక్షాళనకు కేంద్రం కసరత్తు
AA

అవినీతి, కుంభకోణాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వం మంత్రిమండలిని విస్తరించే ఆలోచనల్లో ఉంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముందే కెబినెట్‌ విస్తరణ చేసే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రిమండలిలో రెండు మూడు రోజుల్లో భారీ మార్పులు, చేర్పులు జరుగనున్నాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముందే మంత్రి వర్గ విస్తరణ జరుగవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

యూపీఏ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అవినీతి...కుంభకోణాలతోపాటు...కొన్ని రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలే మంత్రి వర్గ విస్తరణకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇందులో మన్మోహన్‌ సర్కార్‌లో వివిధ కారణాలతో ఖాళీ అయిన శాఖలను భర్తీ చేయనున్నారు. అవినీతిని అడ్డుకోవాలంటే యువతకు అవకాశాలు ఇవ్వాలని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ భావిస్తున్నారు.

మాజీ మంత్రి శశీథరూర్‌ అధికార దుర్వినియోగం ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేయగా...కేంద్ర మంత్రిగా ఉన్న పృద్వీరాజ్‌ ఛౌహాన్ మహారాష్ట్ర ముఖ్యంత్రిగా బాధ్యతలు స్వీకరించటం....వీరితోపాటు 2 జీ స్పెక్ట్రం కుంబకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టెలికం మినిస్టర్‌ ఏ రాజా కేబినెట్‌కు రాజీనామ చేశారు.

మరోవైపు రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని చూస్తున్న కేంద్ర మంత్రి అలిగిరి సైతం తన రాజీనామా లేఖను తండ్రి కరుణానిదికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ శాఖలను భర్తీ చేయడంతో పాటు కొందరి శాఖల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీపీ జోషీలను ఆ శాఖల నుంచి తప్పించి వేరే శాఖలు అప్పగించే అవకాశముంది.

ఇక పోతే వాణిజ్య, పరిశ్రమల సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విదేశాంగ సహాయ మంత్రి బాధ్యతలను అప్పగించనున్నారు. ఇప్పటికే మూడు శాఖలు నిర్వహిస్తున్న వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌కు ఆహార, ప్రజాపంపిణీ శాఖను, పార్లమెంటరీ వ్యవహారాల శాఖను ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌కు అప్పగిస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో వీరి స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు.

జోరు తగ్గిన ఐపీయల్ వేలం

AA 
జయసూర్యకు పలకని గుడ్ విల్ 
ఐపీఎల్ క్రికెటర్ల వేలంపాట రెండోరోజు జోరు తగ్గింది. ఇప్పటికే స్టార్ క్రికెటర్ల వేలంపాట పూర్తవడంతో... ఫ్రాంఛైజీలు సెలక్టివ్‌గా వ్యవహరిస్తున్నాయి. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ డ్యాన్ క్రిస్టియన్‌ను అత్యధికంగా 4 కోట్ల రూపాయల బిడ్డింగ్‌ వేసి డెక్కన్ ఛార్జర్స్ సొంతం చేసుకుంది. భారత ఆటగాళ్లలో ఉమేష్ యాదవ్‌ను 3 కోట్ల 40 లక్షలకు పాడుకొని ఢిల్లీ సొంతం చేసుకుంది.
3 కోట్ల 20 లక్షలకు ముంబై ఇండియన్స్ మునాఫ్ పటేల్‌కు దక్కించుకుంది. బాలాజీ, వినయ్ కుమార్‌లకు రెండు కోట్ల పైనే పలుకగా... అజిత్ అగార్కర్‌ను 95 లక్షలకు ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. కాగ శ్రీలంక వెటరన్ సనత్ జయసూర్య, ఓరమ్, డ్వెయిన్ స్మిత్, బొపారా, బ్రెన్సన్‌ తదితరలపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.

నేడు హస్తిన వెళుతున్న వైఎస్‌ జగన్‌

AA
* ఈ మధ్యాహ్నం ప్రత్యేక రైల్లో ప్రయాణం
* విశాఖలో జగన్‌ తొలి విడత ఓదార్పు యాత్ర గ్రాండ్‌ సక్సెస్‌
*15 వందల మందితో హస్తినకు వెళ్ళనున్న జగన్‌
* సికింద్రాబాద్‌ నుంచి ఒకటిన్నరకు ప్రత్యేక రైలులో పయనం
*ఈ నెల 11న జగన్‌ ఒకరోజు దీక్ష


విశాఖలో జగన్‌ చేపట్టిన తొలి విడత యాత్ర ముగిసింది. యువనేతకు అడుగడుగునా కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఓదార్పు యాత్ర విజయవంతం కావడంతో ఇవాళ ముందు అనుకున్న విధంగా హస్తినకు వెళుతున్నారు. మధ్యాహ్నం సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైల్లో హస్తిన వెళతారు. విశాఖలో జగన్‌ చేపట్టిన తొలి విడత ఓదార్పు యాత్ర గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. అభిమానులు, కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది.

ఆరవ రోజు నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో యువనేత పర్యటించారు. తాండవ, నాతవరం, ఎర్రవరం, కోట ఊరట్ల, చెర్లోపాలెంలలో వైఎస్‌ విగ్రహాలను జగన్‌ ఆవిష్కరించారు. ఎమ్‌.బి.పట్నంలో అక్కయ్యమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. మలి విడత ఓదార్పు యాత్ర ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభమవుతుంది. తొలి విడత ఓదార్పు యాత్ర పూర్తి చేసుకున్న జగన్‌ షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు.

కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుపై హస్తిన వీధుల్లో అన్నదాతల ఆక్రందనలు వినిపించటమే ఆయన ఢిల్లీ పర్యటన ఎజెండా. ఇందులో భాగంగా ఎల్లుండి జంతర్‌మంతర్‌ వద్ద 24 గంటల దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం ఒకటిన్నరకు సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు హస్తినకు బయలుదేరుతుంది. ఈ రైల్లో వెళ్ళేవారి పేర్ల జాబితాను ఆయా జిల్లాల నాయకులకు అందజేశారు.

పదిహేను వందల మంది ప్రజాప్రతినిధులతో కలిసి జగన్‌ ఈ రైలులో ప్రయానిస్తారు. కాగా ఢిల్లీ జగన్‌ యాత్రకు సంఘీభావం తెలపడానికి ఆయన అభిమానులు వందల సంఖ్యలో బయలుదేరారు. తిరుపతి నుంచి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, రైతులు, ప్రజా ప్రతినిధులు ఢిల్లీకి వెలుతున్నట్లు తెలిపారు.

తమది బల ప్రదర్శన కాదని, కేవలం రైతుల సమస్యలను పరిష్కరించాలని సర్కార్‌పై తెస్తున్న వొత్తిడని జగన్‌ అనుచరుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం చలి తీవ్రంగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కార్యకర్తలకు నేతలు విజ్ఞప్తి చేశారు

Saturday, January 8, 2011

అనుష్కని మించేలా అందాలను ఆరబోసిన తమన్నా :


తెలుగు, తమిళ భాషల్లో హీరొయిన్ గా మంచి ఊపు మీదున్న మిల్క్ బ్యూటీ తమన్నా ..ఈ మద్య 'గజినీ' హీరో సూర్య తమ్ముడు కార్తి తో 'ఆవారా' లో నటించిన దగ్గరనుండి ఆయనతో ప్రేమాయణం నడుపుతుందనే వార్తలు   వస్తున్న విషయం తెల్సిందే.తెలుగులో నాగచైతన్యతో,అల్లుఅర్జున్ తో నటిస్తున్న ఈ భామ ..తమిళం లో తన ఫేవరేట్ హీరో కార్తి తో 'సిరుతై' లో నటిస్తుంది.తెలుగులో విక్రమార్కుడు చితానికి రీమేక్  గా రూపొందుతున్న ఈ చిత్రం లో అనుష్క కంటే ఎక్కువ గా అందాలను ఆరబోసింది తమన్నా.ఈ హోత్స్తిల్ల్స్ చూసి సినిమా ఎంత త్వరగా విడుదలవుతుందా  అని తమిళ తంబీలు ఎదురుచూస్తున్నారు...అన్నట్లు ఈ సినిమా తెలుగులో కూడా వస్తుంది...కాస్కోండి మరి..!!!

మద్దెలచెరువు సూరి హత్య పధకం ప్రకారమే...!!

 మద్దెలచెర్వు సూరీ హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను ఒక పథకం ప్రకారం వ్యవహరించి ఎస్కేప్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. అతను అప్పటికప్పుడు డెసిషన్‌ తీసుకుని సూరీని మర్డర్‌ చేయలేదని.. పక్కా స్కెచ్‌ రూపొందించుకుని, దాని ప్రకారమే ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సూరీ హత్యకు నెల రోజుల ముందు నుంచే భాను ప్లాన్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్రారంభించినట్లు తెలుస్తోంది. మద్దెల చెరువు సూరీ హత్యకు అతని ప్రధాన అనుచరుడు భాను సుదీర్ఘ కసరత్తు చేసినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.
అంతా అనుకుంటున్నట్లు సూరీకి, భానుకు ఉన్న పరిచయం ఏడేళ్లది కాదని, పదేళ్ల క్రితం నుంచే వీరి మధ్య సక్యత ఉందని పోలీసులు గుర్తించారు. ముందునుంచీ నేరచరిత ఉన్న భానుకిరణ్‌ గతంలో అక్రమ ఆయుధాల వ్యాపారం చేసేవాడు. 2002లో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇతన్ని అక్రమ ఆయుధాల విక్రయాల కేసులో అరెస్టు చేసి, మూడు ఫైర్‌ ఆర్మ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 2006లో సైదాబాద్‌లో ఓ ప్రాపర్టీ ఇష్యూలో, 2009లో బేగంపేట్‌లో ఆయుధాల కేసులో ఇతను అరెస్టయ్యాడు.
ఇవే కాకుండా బెంగళూరులోనూ ఇతనిపై ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసులున్నాయి. ముందు నుంచి ఇతనికి అక్రమ ఆయుధాలతో అవినాభావ సంబంధం ఉందనడానికి ఈ కేసులే నిదర్శనం. అలా సంపాదించిన కంట్రీమేడ్‌ ఫైర్‌ఆర్మ్స్‌తోనే భాను ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సూరీ హత్యకు సుదీర్ఘ కసరత్తు చేసిన భానుకిరణ్‌ ఏ ఒక్క ఆధారాన్ని వదలకుండా జాగ్రత్తపడ్డాడు. ముందు నుంచీ నేరచరిత్రతో జైలు జీవితం గడిపిన భాను వివాహం చేసుకోలేదు. అతనికి హెడ్‌మాస్టర్‌గా రిటైర్‌ అయిన ఒక తల్లి, ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు.
తల్లి బెంగళూరులో ఉండే సోదరుడి వద్ద ఉంటుండగా... సోదరి ఇరవై రోజుల క్రితం వరకు హైదరాబాద్‌లోనే ఉండేది. ముందే హత్యకు ప్లాన్‌ వేసిన భాను తన సోదరి కుటుంబాన్ని హైదరాబాద్‌ నుంచి షిఫ్ట్‌చేశాడు. సూరీ కొండాపూర్‌కు షిఫ్ట్‌ అయిన తర్వాత భాను కొండాపూర్‌ వైట్‌ఫీల్డ్స్‌లోని వసంత్‌ విహార్‌లోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో ఉండేవాడు. సూరీ హత్యకు ముందే భాను అక్కడ దుకాణం లేపేసినట్లు సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు.
అతను ఉన్న ఫ్లాట్‌లో భానుకు సంబంధించిన ఏ ఒక్క ఆధారాన్నీ విడిచిపెట్టకుండా హత్యకు ముందే వాటిని తరలించాడు. ఇక భానుకు మన్మోహన్‌ సింగ్‌ అనే గన్‌మెన్‌ ఉన్నా... తనకు థ్రెట్‌ ఉంటుందంటూ ఆయుధ లైసెన్స్‌ తీసుకున్నాడు. ఒక సాఫెస్టిగేటెడ్‌ పిస్టల్‌నూ కొనుగోలు చేశాడు. అయితే సూరీ హత్యకు సరిగ్గా నాలుగు రోజుల ముందు... అంటే డిసెంబరు 30 నాడు దాన్ని ఆబిడ్స్‌లోని ఏపీ ఆర్మురీ ఆయుధాల దుకాణంలో డిపాజిట్‌ చేశాడు.
అంటే ముందుగా వేసిన ప్రణాళిక మేరకు ఎక్కడా తాను దోషిని అనే విషయం బయట పడకూడదని ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు విశ్లేషిస్తున్నారు. పక్కా వ్యూహం, ప్రణాళిక ప్రకారం సూరీ సీక్రెట్‌ మీటింగ్‌కు వెళ్లిన సందర్భంలో అతని వెంట ఎవరూ ఉండరని తెలిసీ, సూరీని అంతమొందించినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
చివరకు సూరీ హత్య తర్వాత ఎస్కేప్‌ అయ్యేందుకూ ముగ్గురు నుంచి నలుగురిని ఎంచుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తాను పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు భాను సెల్‌ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. దీంతో తన ఉనికి పోలీసులకు తెలిసే అవకాశమే లేదు. ఇది కూడా భాను స్కెచ్‌లో భాగమేనని పోలీసులు భావిస్తున్నారు.
భానును అరెస్టు చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక బృందాలుగా పనిచేస్తుండగా... సీసీఎస్‌ పోలీసులు సూరీ హత్యవెనక ఉన్న ప్రధాన కారణాలను విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా సూరీ తన ఆస్తులకు బినామీగా భానును పెట్టాడు. ఆ ఆస్తులను తిరిగి తీసుకునే ప్రయత్నంలో సూరీ ఉండడం, పలు సెటిల్మెంట్ల విషయంలో భానును నియంత్రించడం, సూరీ మద్యం మత్తులో ఉన్నప్పుడు భానును దూషించడం, భాను బెజవాడతోపాటు పలు సెటిల్మెంట్లు, అమ్మాయిల బిజినెస్‌లలో సూరీపేరును వినియోగించడంపై వీరి మధ్య విభేదాలు నెలకొన్నాయి.
సూరీ కుక్‌ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు హత్య జరిగిన రోజు అతను విధులకు హాజరు కాలేదని, భాను అతన్ని రెండ్రోజులు రావద్దని చెప్పడానే విషయాన్ని గుర్తించారు. ఇక్కడా భాను పక్కాగా తన ప్లాన్‌ ప్రకారం ఇదంతా చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక సూరీ వ్యక్తిగత ల్యాప్‌టాప్‌తో పాటు, అతని ఇంట్లోని మూడు సెల్‌ఫోన్లను సీజ్‌ చేసిన అధికారులు వాటిని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబ్‌కు తరలించారు. ఫోరెన్సిక్‌ అధికారులు ల్యాప్‌టాప్‌లోని బ్యాకప్‌, రిమూవ్‌ అయిన డేటాను విశ్లేషిస్తున్నారు. లాప్‌టాప్‌ విశ్లేషణ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సూరీ సెటిల్మెంట్లు జరిపిన విషయాన్ని పోలీసులు గుర్తించారు.

జగన్ పై పోటీకి నేను సిద్ధం : డీ యల్ రవీంద్ర



హైదరాబాద్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై తాను పోటీకి సిద్ధమని వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. కడపలోనే తేల్చుకుందామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వైయస్ జగన్‌ను సవాల్ చేశారు. తాను రాజీనామా చేసి వైయస్ జగన్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. వైయస్ జగన్ బ్లాక్ మొయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్సించారు. బ్లాక్ మొయిల్ చేసి శాసనసభ్యులను ఢిల్లీ దీక్షకు తీసుకుని వెళ్లాలని వైయస్ జగన్ చూస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ శాసనసభ్యులను కొంటున్నారని ఆయన ఆరోపించారు.

ధనమదంతో తన పత్రికలో వైయస్ జగన్ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయిస్తున్నారని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులు రాజీనామాలు చేసి, తిరిగి వైయస్ జగన్ పార్టీ కింద పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ గనుల తవ్వకాల్లో వైయస్ జగన్ పాత్ర ఉందని, కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రకటన ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని, తెలంగాణ కోసం శాసనసభలో తీర్మానం పెట్టాలంటే అందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

గంభీర్‌ కోసం ఫ్రాంచైల హోరాహోరీ... 11 కోట్లకు దక్కించుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్

AA

IPL4: 11 కోట్లకు గంభీర్‌ను దక్కించుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ .దల్షాన్‌ను 3 కోట్లకు దక్కించుకున్న బెంగుళూర్‌. 4 కోట్లకు జహీర్‌ఖాన్‌ను దక్కించుకున్న బెంగుళూర్.‌ 4.6 కోట్లకు రాస్‌టేలర్‌ను దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్‌. 9.5 కోట్లకు యూసఫ్‌ పఠాన్‌ను కొనుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ .

చిరంజీవి చిత్రానికి బ్రేక్‌లు..!

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి 150వ చిత్రానికి ముహూర్తం కుదరడం లేదు. ఆయన సినిమాకు రాజకీయాల వల్ల బ్రేక్‌లు పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల వల్ల అది అనుకున్న సమయానికి ప్రారంభమయ్యే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక, వైయస్ జగన్ వ్యవహారం నేపథ్యంలో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలున్నట్లు అంచనాలు సాగుతున్నాయి. దీంతో చిరంజీవి పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమైక్యాంధ్ర వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో సీమాంధ్రలో తనకు విశేష ఆదరణ లభిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. దీంతో కలిసి వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పార్టీకి ప్రాణం పోయాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు సినిమాను కొంత కాలం వాయిదా వేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

విజయశాంతి అరెస్టు..!


హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీ గేటు వద్ద మెదక్‌ ఎంపీ విజయశాంతిని పోలీసులు అరెస్టు చేశారు. ఓయూ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న విజయశాంతితోపాటు మరికొంత మంది జేఏసీ మహిళలను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

జనవరి 13న పార్టీ పేరు ప్రకటించనున్న వై యస్ జగన్..!

 
కడప మాజీ యంపీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన పార్టీ పేరుని ఈ నెల 13న ఇడుపులపాయ లోని వై యస్ ఘాట్ వద్ద బహిర్గతం చేయనున్నారని కడప మాజీ మేయర్ రవీంద్రనాధరెడ్డి  తెలిపారు.ఈ విషయాన్ని ఖాజీపేట్ మీడియా ప్రతినిదులకి తెలియ పరుస్తూ,కొత్త పార్టీ వై యస్ ఆర్  ఆశయాలను సాధిస్తుందని పేర్కొన్నారు.వై యస్ పాలన దొంగల రాజ్యం అని వ్యాఖ్యానించిన  డీ యల్ రవీంద్ర రెడ్డి ని ఆ లూటీ లో తనకెంత ముట్టిందో అని మాజీ మేయర్ ఎద్దేవా చేసారు.

రామ్ చరణ్ కష్టాలు...!


రామ్ చరణ్ కెరీర్ ఆరెంజ్ సినిమాతో మలుపు తీసుకోబోతోంది అని నాగబాబు అంటుంటే ఏంటో అర్థం కాలేదు గానీ ఇప్పుడు బుడ్డ మెగాస్టార్ పడుతున్న కష్టాలు చూస్తుంటే మెగా కుటుంబం మొత్తం ‘అయ్యో పాపం’ అంటుందట. ఆరెంజ్ తర్వాత మొదలైన రామ్ చరణ్ ‘మెరుపు’ కల నెరవేరటానికి ఎన్నో అడ్డంకులు ముందు పడుతుండటంతో అసలు ఈ సినిమా విడుదల సాధ్యమేనా? అనిపిస్తోంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న మెరుపు చిత్ర కథ, స్ర్కిప్ట్ నచ్చట్లేదని చరణ్ బాబు ఇప్పుడు దర్శకుడు ధరణి ని ముప్పు తిప్పలు పెడుతున్నాడట.

ఓ షెడ్యూల్ అయిపోయాక మళ్లీ మొదటి నుండి తీయటం అంటే మాకు పెద్ద బొక్క అని నిర్మాత చౌదరి గారు చీర చుట్టేయటం, మరోపక్క ధరణి బిక్కమొహం వేసుకోవటం, ఇవేవీ చాలక ఆస్ట్రేలియా కోచ్ అంటూ చరణ్ ఫుట్ బాల్ ఆడుకోవటం చూసి చిర్రెత్తుకొచ్చిన కాజల్ సినిమా నుండి పారిపోవటం చూస్తుంటే, చచ్చీ చెడీ సినిమా ఓ సంవత్సరం తరువాత విడుదలైనా ఇది మెరుపు కల కాదు గానీ ప్రేక్షకుల మీద మెరుపు దాడి అని మాత్రం ఖచ్చితంగా చేస్తుందంటున్నారు అభిమానులు.

సమస్యను మరింత జటిలం చేస్తున్న శ్రీ కృష్ణ కమిటీ


AAశ్రీ కృష్ణ కమిటి సమస్యను పరిష్కరించాల్సింది పోయి, మరింత జటిలం చేసిందంటున్నారు సీపీఐ కార్యదర్శి నారాయణ. యుద్ధ టాంకులు, సైన్యం ద్వారా తెలంగాణ సమస్య పరిష్కారం కాదన్న ఆయన రాజకీయ నిర్ణయం ద్వారానే పరిష్కారం సాధ్యమంటున్నారు.

సచ్చివాలయం లో "తెలంగాణ-ఉద్యోగులపై" ఆంక్షలు

AA

సచివాలయంలో ఉద్యోగులు రాజకీయ నిరసనలు, ధర్నాలు చేయడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల కార్యకలాపాలు సెక్రటెరియట్‌లో పెరగడంతో ఈ ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ గెజిటెజ్‌ ఆఫీసర్స్‌ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పిలవడం, నిన్న శ్రీకృష్ణ కమిటీ నివేదికపై భోజన విరామ సమయంలో నిరసన లాంటివి ఈ ఆంక్షలు విధించడానికి కారణంగా తెలుస్తోంది.

సూరి హత్యకేసులో 'నిందితుడు అరెస్ట్‌'

AAAA
పోలీసుల అదుపులో భాను కిరణ్‌

మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నటువంటి భాను ను బెంగుళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

భాను కిరణ్‌ అక్కాబావల్ని విచారించిన పోలీసులు
భాను కిరణ్‌ అక్కాబావల్ని పోలీసులు విచారించారు. అక్క విజయలక్ష్మీ, బావ బ్రహ్మనందంలను పోలీసులు ప్రశ్నించి వదిలేశారు. సూరి అనుచరుడు, హంతకుడు భాను కిరణ్‌ తమ అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Friday, January 7, 2011

బికినీ,లిప్ లాక్ కి రెడీ అంటున్న తాప్సి..!


‘ఝమ్మంది నాదం’ చిత్రంలో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న తాప్సీ ప్రస్తుతం తెలుగులో విడుదలకు సిద్దమైన ‘వస్తాడు నా రాజు’, ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’ చిత్రాలు చేసింది. అలాగే మరో రెండు ప్రాజెక్ట్ లు కమిట్ అయ్యిందట. ఇక తమిళంలో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేసింది. ఇప్పుడు తను ఒప్పుకున్న ఈ ఆరు సినిమాలు పూర్తయిన తర్వాత బికినీ, లిప్ లాక్ సీన్లు చేస్తానని తాప్సీ చెబుతోంది. ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి అడుగుపెట్టింది కాబట్టి మంచి ఆఫర్లతో ముందు ముందు బాగా ఎక్స్ పోజింగ్ చేసే పనిలో పడేట్టుంది. అందుకే మరో ఆరు సినిమాలు చేసిన తర్వాత తన తడాఖా చూపిస్తానంటోంది తాప్సీ అని చెప్పొచ్చు.

వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు


AA

తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు తప్ప మరేదానికి ఒప్పుకోమని ఆ ప్రాంత నేతలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలు .. నేతల సమాలోచనలతో శీతాకాలంలోనూ రాష్ట్రంలో వేడివేడి వాతావరణం నెలకొంది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై కేంద్రం మనసులో ఏమున్నా ప్రత్యేక రాష్ర్టం తప్ప సమస్యకు వేరే పరిష్కారం లేదని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గట్టి పట్టుదలతో ఉండగా.

ప్రధాన ప్రతిపక్షం మాత్రం అధికార పక్షాన్ని ఎండగట్టేందుకు కొత్త కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టబోతోంది. రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులనుంచి బయటపడేందుకు అధిష్టానం తీవ్రంగా యోచిస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పార్టీల ఏకాభిప్రాయం కోసం కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందలో భాగంగా ఢిల్లీలో రాత్రి కోర్ కమిటీ సమావేశం నిర్వహించింది.

శ్రీకృష్ణకమిటీ రిపోర్టుతో పాటు తెలంగాణ అంశంపై ఈ మీటింగ్ లో దాదాపు గంటసేపు చర్చించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో మరోమారు సమావేశం నిర్వహించిన తర్వాతే , మిగిలిన వారితో చర్చలు జరపాలని అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి రావద్దని జోరుగా పావులు కదుపుతున్నారు.

ప్రణబ్‌లాంటి పెద్దలు ఢిల్లీలో కూర్చోబెట్టి ఎన్ని చెప్పినా బిల్లు పెట్టకపోతే రాజీనామే శరణ్యమని ఎంపీలు హెచ్చరిస్తున్నారు. దీంతో అఖిలపక్షం భేటీలోగా ఎంపీలతో మరోమారు సమావేశమవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఇదిలావుంటే, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉద్యమానికి ఒక రూపం ఇచ్చేందుకు ఆ ప్రాంత నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.

దశల వారిగా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. నెలాఖరు నాటికి వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయలను చెప్పిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచించాలన్నది వారి భావన. ఏదేమైనా పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టకపోతే ఎంతకైనా తెగించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రెడీ అయ్యారు. రాజీనామాలే కాదు ఆమరణ దీక్షలకు కూడా వారు మానసికంగా సంసిద్ధులవుతున్నారు.

కాంగ్రెస్‌ నేతల పరిస్థితి ఇలావుంటే టీడీపీ వారిది మరోలా వుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇచ్చిన స్వేఛ్చతో తెలంగాణా అంశంపై ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసుకున్న నేతలు సోమవారం నాడు విస్తృతస్థాయి సమావేశంలో చర్చించి భవిష్య కార్యాచరణను ఖరారు చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దపడుతున్నారు.

కాలయాపనతో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కుట్ర పూరిత వ్యూహాన్ని ప్రజల ముందు ఉంచాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. అన్ని ప్రాంతాలలో సమిష్టిగా బస్సు యాత్ర నిర్వహించి సభలు నిర్వహించడం ద్వారా మోసం చేస్తున్న కాంగ్రెస్‌ను ఎండగట్టాలన్నది వ్యూహం. రెండు మూడు రోజుల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించి ఉద్యమబాట పట్టాలని ప్రణాళికను రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఫ్యాక్షన్ ఉచ్చులో బాలయ్య సినిమా


కోట్లు ఖర్చు పెట్టి మరీ వరసగా భయంకరమైన ప్లాపులిచ్చిన నిర్మాత సింగనమల రమేష్ బాబు దగ్గర ఒక్క ఏడాదిలో వంద కోట్లు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయో అనుకునే వాళ్లకి ఫ్యాక్షన్ రారాజు మద్దెల చెరువు సూరి హత్యే సమాధానం అయ్యింది. ఖలేజ, పులి లాంటి రెండు అడ్డగోలు చిత్రాలను సూరి దగ్గర నుండి ఫైనాన్స్ తీసుకునే సి కళ్యాణ్, సింగనమలలు పూర్తి చేసి విడుదల చేసారని దర్యాప్తులో తేలడంతో ఇంకెంత బాకీ ఉన్నారన్నదే అసలు క్వశ్చన్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇచ్చిన షాక్ తో ఒళ్లు గుల్ల చేసుకున్న సింగనమల హైదరాబాద్, బెంగుళూరులలో ఉన్న తన ఆస్థి మొత్తం సూరికి అప్పగించేస్తే కళ్యాణ్ మాత్రం ‘పరమ వీర చక్ర’ మీదనే ఆశలు పెట్టుకుని బతుకుతున్నాడు. మరి సూరి ఫ్యాక్షన్ అనుచరులు బాకీ కింద పరమ చెత్తగా తయారయ్యిందన్న పరమ వీర చక్రను జప్తు చేస్తారా లేక వదిలేస్తారా అన్నది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతుందేమో చూడాలి.

తెలంగాణపై జయేంద్ర సంచలన వ్యాఖ్యలు


AA

* రాష్ట్రాన్ని విడగొడితేనే బెటరన్న స్వామీజీ

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. తెలంగాణ, సీమాంధ్రలను రెండుగా విడదీయాలని ఆయన గుంటూరులో చెప్పారు. టీటీడీకి పాలకమండలి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో రామాలయ నిర్మాణానికి సంబంధించి ముస్లిం నేతలతో అంగీకారం కుదిరిందన్న జయేంద్ర, ఈ లోగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం వల్ల ఈ ప్రతిపాదన నిలిచిపోయిందని తెలిపారు.

బిల్లు పెట్టకుంటే ' రాజీనామాలకు సిద్ధం '


AAవచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణా బిల్లు పెట్టకుంటే రాజీనామాలకు సిద్ధమని.. అవసరమైతే ఆమరణ దీక్షకు కూడా దిగుతానని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. భవిష్యత్‌ కార్యాచరణపై తెలంగాణా ప్రజాప్రతినిధులు నిజాం క్లబ్‌లో సమావేశమయ్యారు. తెలంగాణా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంతో పాటు... అదనపు బలగాల ఉపసంహరించాలని వారు డిమాండ్ చేసారు. 

గులాంనబీ తో భేటి అయిన సీఎం .

 
సీఎం  కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి గులాంనబి ఆజాద్ తో సమావేశం అయ్యారు. లేక్వవ్యూ గెస్ట్హౌసులో అరగంట పాటు వీరి చర్చ జరిగినట్లు సమాచారం.ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గులాంనబీ హైదరాబాద్ వచ్చారు.గురువారం ఆజాద్ లేక్వ్యూ అతిదిగ్రుహం లో బస చేసారు.రాత్రి డిల్లి నుంచి హైదరాబాద్ వచ్చిన సీఎం ,ఈ ఉదయం ఆయన్ను కలిసారు.సుమారు అరగంటకు పైగా వారు మంతనాలు సాగించారు,శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వెల్లడైన నేపధ్యంలో రాష్ట్రం లో నెలకొన్న పరిణామాల పై వారు చర్చారు.ముఖ్యం గా తెలంగణ రాష్ట్రం ఇస్తే జరిగే పరిణామాల పై చర్చినట్లు సమాచారం.

సమంత నడుము గిల్లిన పోకిరి ......!!

Thursday, January 6, 2011

శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు పై భిన్న అభిప్రాయాలు

  AA
శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుతో రాష్ర్ట నేతల వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపించట్లేదు. ప్రధాన పార్టీల నాయకులు చాలా వరకు ప్రాంతాలవారిగా పాత వైఖరులనే పునరుద్ఘాటి స్తున్నారు. ఒక ప్రాంతంవారు స్వాగతిస్తుండగా, మరొక ప్రాంతంవారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక బహిర్గతం కావడంతో అధికారపార్టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నివేదికను అద్యయనం చేసేపనిలో పడ్డారు.

కమిటీ చేసిన సూచనలను ఎవరికి వారే తమతమ ప్రాంతాలకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భవిష్యత్‌ కార్యక్రమంపై చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రా న్ని సీమాంద్ర ,తెలంగాణ గా విభజించాలన్న కమిటీ సూచించిన అంశం మాత్రమే తమకు పూర్తిగా అంగీకారమని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిర్ణయానికి కొచ్చారు.

అధిష్టానం ఈ సూచనకు అనుగుణంగానే నిర్ణయం తీసుకోవాలని వారు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు కోస్తాంద్ర కాంగ్రెస్ నేతలు శ్రీకృష్ణ కమిటి నివేదిక మొత్తాన్ని తాము స్వాగతిస్తున్నామని అంటున్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని తమ పార్టీ ఒక్కటే భుజాన వేసుకోనవసరం లేదని, అన్ని పార్టీలతో చర్చించి ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమే నని అంటున్నారు.

మరోవైపు రాయల సీమ నేతలు మాత్రం ఉంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలి లేదంటే రాయల తెలంగాణ కావల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. కమిటీ నివేదిక లోని అంశాలనతో ఎవరూ నిరుత్సాహ పడనవసరం లేదని మాజీమంత్రి జేసి.దివాకర్‌ రెడ్డి అంటున్నారు. శ్రీకృష్ణ కమిటి నివేదిక పై మరోసారి చర్చించడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఇవాళ సమావేశమవుతారు. ఇక టీడీపీ నేతల వైఖరి కూడా కాంగ్రెస్‌ నేతల తీరుకు ఏమాత్రం భిన్నంగా లేదు.

నివేదికపై తమకు నమ్మకం లేదని మొదటినుండీ చెప్తున్న తెలంగాణా టీడీపీ నేతలు ఇప్పుడూ అదే అంటున్నారు. రెండు, ఐదు మినహా మిగిలిన అంశాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టించి తెలంగాణా సాధించేవరకూ పోరాడుతామని పునరుద్ఘాటిస్తున్నారు. మరోవైపు, రిపోర్టుపట్ల సీమాంధ్ర టీడీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా భిన్నరూపాల్లో స్పందించారు. నివేదిక రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్ధం పట్టిందని కొందరంటుండగా అస్పష్టంగా వుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

నివేదికలోని ఆరవ సిఫార్సువైపు వారు మొగ్గుచూపుతున్నారు. ఇక ఈ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం ఎప్పటి లాగే బంతిని కాంగ్రెస్‌ కోర్టులో వేసినట్టు తెలుస్తోంది. నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకోవాల్సింది, ఏమి చేస్తారో ముందు చెప్పాల్సింది కేంద్రం, అధికార పార్టీయేనని అన్నట్టు సమాచారం.

భద్రతామండలి శాశ్వత సభ్యత్యానికి భారత్‌ కొత్త ఎత్తులు


AA


అమెరికాతో వాణిజ్య ఒప్పందాల అనంతరం భారత్‌ కదలికల్లో మార్పువస్తోంది. భద్రతామండలి శాశ్వత సభ్యత్వం కోసం చిరకాల మిత్రులను పక్కన పెట్టే చర్యలకు భారత్‌ దిగుతోంది. ఇందులో భాగంగా ఇరాన్‌తో దోస్తీని వదులుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు చిరకాల స్నేహం, మరోవైపు పెద్దన్నలతో వ్యాపార ఒప్పందాలు..ఈ రెండింటి నడుమ దేశ చిరకాల వాంఛ.

ఎటువైపు ఎలా అడుగులు వేయాలో తెలియక కాలమే సమాధానం చెబుతుందన్నట్లు భారత్‌ మిన్నకుంటుంది. వందలఏళ్లుగా సన్నిహత సంబంధాలుండి, దేశీయంగా చమురు అవసరాలను తీరుస్తున్న ఇరాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఇప్పుడు అడుగులు వేస్తోంది. అణ్వస్త్రాల విషయంలో తన మాట వినని ఇరాన్‌ ను ఒంటరి చేయాలనే ఉచ్చులో భారత్‌ తన వంతు సహకారాన్ని అమెరికాకు అందిస్తోంది.

ఇరాన్‌ నుంచి దిగుమతయ్యే ముడి చమురు చెల్లింపులను డాలర్లు-యూరోల్లో జరపకూడదనే ఉద్దేశ్యంతోనే ఐరోపా-అమెరికా సమాజానికి భారత్‌ తలూపింది. ఏలానో చెప్పకుండా మరో రూపంలో చెల్లిస్తామంటూ ఇరాన్ తో ముక్తాయింపుగా భారత్‌ వ్యవహరిస్తోంది. దీనికి ఓ కారణం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం తహతహాలాడుతున్న భారత్‌ సందట్లో సడేమియా లాగా అమెరికా-ఐరోపా సమాజాల మెప్పుపొందేందుకు ప్రయత్నిస్తుంది.

గతంలో కాశ్మీర్‌ విషయంలో ఇరాన్‌ పాక్‌ కు వంత పాడగా.. అణ్వస్త్రాల విషయంలో ఇరాన్‌ కు భారత్‌ వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇవేమి ఇండో-ఇరాన్‌ ల మధ్య వైరాన్ని పెంచలేదు. కాని చమురు చెల్లింపుల విషయంలో కాలక్షేపం చేస్తూ, కొత్తప్రతిపాదనలేవి తేకుండా భారత్ వ్యవహరిస్తున్న అంతర్జాతీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోంది.

సమితిలో శాశ్వత సభ్యత్వం దిశగా భారత్‌ చేస్తున్న ప్రయత్నం తప్పుకాదు కాని అదే సమయంలో దేశీయంగా అవసరాలు తీరుస్తున్న ఇరాన్‌తో వైరం పెంచుకోవడం ఎలాంటి ఉపద్రవానికి దారి తీస్తుందోనని ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశీయంగా ఉత్పత్తి అవుతున్న చమురును అగ్రదేశాలు ఎగుమతి చేసుకోలేకపోతే ఎక్కువగా నష్టపోయోది ఇరానే నని మేథావి వర్గం అంచనావేస్తున్నారు. ఏది ఏమైనా ఒబామా పర్యటన అనంతరం భారత్‌ కదలికల్లో మార్పు వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పోరాడి తెలంగాణ సాధించుకుందాం : కేసీఆర్

AA

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకం కాదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన, రిపోర్టు ఎవరికి వారు అనుకూలంగా చెప్పుకునేలా ఉందని ఎద్దేవా చేశారు.1956కు ముందున్న తెలంగాణ తప్ప మరేది ఒప్పకోమన్న కేసీఆర్, పోరాడి తెలంగాణ సాధించుకుందామని తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు. ఇప్పుడైనా పొలిటికల్ బెటాలియన్లు కదలాలన్న టీఆర్ఎస్ చీఫ్, పార్లమెంట్ లో బిల్లు పెట్టే వరకు ఉద్యమిస్తామని అన్నారు.

మల్లూవుడ్ పై గురి పెట్టిన తాప్సి.....!

ఎన్టీఆర్‌ తో ‘గర్జన’కు బోయపాటి !

అందాల ముద్దుగుమ్మ త్రిష అతి త్వరలో నందమూరి వారి కాంపౌండ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధంగా వుంది. నందమూరి బాలకృష్ణతో ‘సింహా’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాను నిర్మించిన బోయపాటి శ్రీను అతి త్వరలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. కెఎస్‌ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించబోతోందనే వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రానికి ‘గర్జన’అనే టైటిల్‌ని ఖరారు చేశారట. ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఎన్టీర్‌ ‘శక్తి’ చిత్రంలో నటిస్తూ బిజీగా వున్నాడు. బోయపాటి శ్రీను కూడా ‘గర్జన’ కథకు పదునుపెడూ బిజీగా వున్నాడు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక- 6సూచనలు




మొదటిసూచన - రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచి తెలంగాణ కోసం మూడు ప్రత్యేక బోర్డులు

రెండవసూచన - తెలంగాణ,ఆంధ్రరాష్ట్రాలుగా విభజన ( 1956కు ముందున్న పరిస్థితి పునరుద్ధరణ )

మూడవసూచన - హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ మహబూబ్ నగర్ లతో కేంద్ర పాలితప్రాంతం

నాలుగవసూచన - రాయలసీమ తెలంగాణలను కలుపుతూ రాయలతెలంగాణ ఏర్పాటు

ఐదవసూచన - రాష్ట్రాన్ని యధాతథంగా కొనసాగించడం

ఆరవ సూచన-రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూ తెలంగాణ సామాజిక అభివృద్దికి ప్రత్యేక మండలి ఏర్పాటు.

శ్రీకృష్ణ నివేదికపై "పీఆర్పీ" సంతృప్తి


  • AA


శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పీఆర్పీ నేత సి. రామచంద్రయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ నిర్వహించిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ఆయన కమిటీ రిపోర్ట్‌ ఆమోదయోగ్యంగా ఉందని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.


Check here for Sri Krishna committee Full Report

Download

Wednesday, January 5, 2011

శ్రీకృష్ణకమిటీ నివేదిక బహిర్గతం కానున్న సందర్బంలో కాంగ్రెస్ పార్టీ


  శ్రీకృష్ణకమిటీ నివేదిక బహిర్గతం కానున్న సందర్బంలో కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. రెండు ప్రాంతాల నేతలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాజీనామా హెచ్చరికలు చేస్తున్న తెలంగాణ ఎంపీలను బుజ్జగించేందుకు ప్రణబ్ ముఖర్జీ రంగంలోకి దిగారు. నివేదిక ఏప్రాంతానికి అనుకూలంగా ఉన్నా సంయమనంతో ఉండాలని అధిస్టానం సూచిస్తోంది.

అఖిలపక్షానికి ' టీడీపీ డుమ్మా '


AA

* చిదంబరానికి చంద్రబాబు లేఖ

కేంద్ర మంత్రి చిదంబరం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి హజరు కాకూడదని తెలుగుదేశంపార్టీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి చిదంబరానికి లేఖరాశారు. నివేదిక అందిన తరువాత నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని అందులో పేర్కొన్నారు. గతంలోనే తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసినందున ఇప్పుడు మరోసారి సమావేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదని టిడిపి సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి చెప్పారు.


  

పాపం ప్రియమణి కోరిక తీరుతుందా?


AA

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘నరసింహా’ చిత్రం ఒక్కసారి గుర్తు చేసుకుటే మీ అందరికీ ఆ చిత్రంలో హీరోయిన్‌గా, విలన్‌గా నటించిన రమ్యకృష్ణ తప్పకుండా గుర్తుకు వస్తుంది కదూ. సరిగ్గా అలాంటి క్యారెక్టర్‌లో నటించాలనే కోరికతో రగిలిపోతుంది అందాల హాట్‌ బ్యూటీ ప్రియమణి. ఇటీవల ఓ సందర్భంలో ప్రియమణి మాట్లాడుతూ.. ‘2010లో నేను నటించిన ‘రక్తచరిత్ర, రావణ్‌, రగడ’ వంటి చిత్రాలు కలిసిరాలేదు.

అయితే నా పాత్రలకు మాత్రం మంచి పేరు వచ్చింది అంటూ.. మంచి లెడీ ఓరియంటెడ్‌ కథ వుంటే నేను నటించడానికి సిద్ధంగా వున్నాను. రెమ్యునరేషన్‌ విషయంలో కూడా నేను పెద్దగా పట్టించుకోను’’ అని అంటోంది. దర్శక, నిర్మాతలు ఈ విషయంలో కాస్త ఆలోచించంటి మరి.