లవర్ బోయ్ గా యాక్షన్ హీరో
గోపిచంద్ లో యాక్షన్ హీరో లక్షణాలు ఎక్కువ. ఇతగాడి మీద దర్శకులు ఓ మాంచి యాక్షన్ సినిమానే తీయాలని అనుకుంటారు. కానీ దీనికి భిన్నంగా ‘వాంటెడ్’ చిత్ర దర్శకుడు బివియస్ రవి లవర్ బోయ్ గా గోపిచంద్ ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నెల 21న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాలో గోపిచంద్ కొత్త లుక్ తో కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం విడుదలయిన ఈ సినిమా స్టిల్స్ చూసిన వారు లవర్ బోయ్ లా కనిపిస్తున్న గోపీచంద్ అమ్మాయిల మనసులను కొల్లగొడతాడని చెప్పుకుంటున్నారు. గోపిచంద్ తరహా యాక్షన్‌తో పాటు సినిమా చాలా కొత్తగా, స్టయిలిష్ గా అనిపిస్తుంది. ‘వాంటెడ్’ అనేది ఈ చిత్రానికి యాప్ట్ టైటిల్. ఇందులో హీరోకి హీరోయిన్ ‘వాంటెడ్’. హీరోయిన్‌కి విలన్ ‘వాంటెడ్’. విలన్ కి హీరో ‘వాంటెడ్’. ఇదే ఈ చిత్రం ప్రధాన కథాంశంమరి బివియస్ రవి చేసిన ఈ ప్రయత్నం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన వేదం హీరోయిన్ దీక్షాసేథ్ కథానాయికగా నటించింది.
అతని కళ్ళలో తెలియని మత్తు
‘ఆ కళ్ళలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి వుంది. తదేకంగా ఆ కళ్ళలోకి చూస్తే, ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. నేనూ అలాగే పడిపోయా’. ఇంతకీ శృతిహసన్ ని ప్లాట్ చేసిన ఆ కళ్లు ఎవరివబ్బా? అనుకుంటున్నారా..ఆ కళ్లు ఎవరివోకావు. తమిళహీరో గజినీ సూర్యవి. ఆయనతో కలిసి ‘ఎజాన్ అరిపు’ అనే చిత్రంలో నటిస్తున్నారు శృతి. ఆ చిత్రం షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను నెమరువేసుకుంటూ, శృతి పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..నటనకు సంబంధించిన ఏ విషయాన్నీ సూర్య తేలిగ్గా తీసుకోరు. అంతే కాదు సిన్సియారిటీ ఆయనకు ఆభరణం. ఇవన్నీ ఆయన వద్ద చాలా మంది నేర్చుకోవాలి” అని చెప్పారు శృతి. సిన్సియారిటీలోనూ, సీరియస్ నెస్ లోనూ, బిహేవియర్ లోనూ, నటనలోనూ ఇలా అన్నింటిలో కమల్ గారే ఆదర్శం అని హీరోలందరూ అంటుంటే.. కమల్ కూతురైన ఈవిడేమో… సూర్యను చూసి నేర్చుకోవాలంటున్నారు.
ఫ్యాక్షన్ ఉచ్చులో బాలయ్య సినిమా
కోట్లు ఖర్చు పెట్టి మరీ వరసగా భయంకరమైన ప్లాపులిచ్చిన నిర్మాత సింగనమల రమేష్ బాబు దగ్గర ఒక్క ఏడాదిలో వంద కోట్లు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయో అనుకునే వాళ్లకి ఫ్యాక్షన్ రారాజు మద్దెల చెరువు సూరి హత్యే సమాధానం అయ్యింది. ఖలేజ, పులి లాంటి రెండు అడ్డగోలు చిత్రాలను సూరి దగ్గర నుండి ఫైనాన్స్ తీసుకునే సి కళ్యాణ్, సింగనమలలు పూర్తి చేసి విడుదల చేసారని దర్యాప్తులో తేలడంతో ఇంకెంత బాకీ ఉన్నారన్నదే అసలు క్వశ్చన్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇచ్చిన షాక్ తో ఒళ్లు గుల్ల చేసుకున్న సింగనమల హైదరాబాద్, బెంగుళూరులలో ఉన్న తన ఆస్థి మొత్తం సూరికి అప్పగించేస్తే కళ్యాణ్ మాత్రం ‘పరమ వీర చక్ర’ మీదనే ఆశలు పెట్టుకుని బతుకుతున్నాడు. మరి సూరి ఫ్యాక్షన్ అనుచరులు బాకీ కింద పరమ చెత్తగా తయారయ్యిందన్న పరమ వీర చక్రను జప్తు చేస్తారా లేక వదిలేస్తారా అన్నది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతుందేమో చూడాలి.
బికినీ,లిప్ లాక్ కి రెడీ అంటున్న తాప్సి..!
‘ఝమ్మంది నాదం’ చిత్రంలో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న తాప్సీ ప్రస్తుతం తెలుగులో విడుదలకు సిద్దమైన ‘వస్తాడు నా రాజు’, ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’ చిత్రాలు చేసింది. అలాగే మరో రెండు ప్రాజెక్ట్ లు కమిట్ అయ్యిందట. ఇక తమిళంలో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేసింది. ఇప్పుడు తను ఒప్పుకున్న ఈ ఆరు సినిమాలు పూర్తయిన తర్వాత బికినీ, లిప్ లాక్ సీన్లు చేస్తానని తాప్సీ చెబుతోంది. ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి అడుగుపెట్టింది కాబట్టి మంచి ఆఫర్లతో ముందు ముందు బాగా ఎక్స్ పోజింగ్ చేసే పనిలో పడేట్టుంది. అందుకే మరో ఆరు సినిమాలు చేసిన తర్వాత తన తడాఖా చూపిస్తానంటోంది తాప్సీ అని చెప్పొచ్చు.