Monday, January 10, 2011

తెలంగాణకు "హైదరాబాదే" రాజధాని


AA


*మనస్సులో మాట బయటపెట్టిన కేకే

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణాకు అనుకూలమే అంటున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేకే. ఐదో సూచనను తామంతా ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ రాజధానిగా తాము తెలంగాణను కోరుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి విభేధాలు లేవన్న ఆయన రేపు సికింద్రాబాద్‌ కేజేఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌తో కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డిని ఆహ్వానించినట్లు వెల్లడించారు.

No comments:

Post a Comment