Sunday, January 9, 2011

నేడు హస్తిన వెళుతున్న వైఎస్‌ జగన్‌

AA
* ఈ మధ్యాహ్నం ప్రత్యేక రైల్లో ప్రయాణం
* విశాఖలో జగన్‌ తొలి విడత ఓదార్పు యాత్ర గ్రాండ్‌ సక్సెస్‌
*15 వందల మందితో హస్తినకు వెళ్ళనున్న జగన్‌
* సికింద్రాబాద్‌ నుంచి ఒకటిన్నరకు ప్రత్యేక రైలులో పయనం
*ఈ నెల 11న జగన్‌ ఒకరోజు దీక్ష


విశాఖలో జగన్‌ చేపట్టిన తొలి విడత యాత్ర ముగిసింది. యువనేతకు అడుగడుగునా కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఓదార్పు యాత్ర విజయవంతం కావడంతో ఇవాళ ముందు అనుకున్న విధంగా హస్తినకు వెళుతున్నారు. మధ్యాహ్నం సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైల్లో హస్తిన వెళతారు. విశాఖలో జగన్‌ చేపట్టిన తొలి విడత ఓదార్పు యాత్ర గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. అభిమానులు, కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది.

ఆరవ రోజు నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో యువనేత పర్యటించారు. తాండవ, నాతవరం, ఎర్రవరం, కోట ఊరట్ల, చెర్లోపాలెంలలో వైఎస్‌ విగ్రహాలను జగన్‌ ఆవిష్కరించారు. ఎమ్‌.బి.పట్నంలో అక్కయ్యమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. మలి విడత ఓదార్పు యాత్ర ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభమవుతుంది. తొలి విడత ఓదార్పు యాత్ర పూర్తి చేసుకున్న జగన్‌ షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు.

కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుపై హస్తిన వీధుల్లో అన్నదాతల ఆక్రందనలు వినిపించటమే ఆయన ఢిల్లీ పర్యటన ఎజెండా. ఇందులో భాగంగా ఎల్లుండి జంతర్‌మంతర్‌ వద్ద 24 గంటల దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం ఒకటిన్నరకు సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు హస్తినకు బయలుదేరుతుంది. ఈ రైల్లో వెళ్ళేవారి పేర్ల జాబితాను ఆయా జిల్లాల నాయకులకు అందజేశారు.

పదిహేను వందల మంది ప్రజాప్రతినిధులతో కలిసి జగన్‌ ఈ రైలులో ప్రయానిస్తారు. కాగా ఢిల్లీ జగన్‌ యాత్రకు సంఘీభావం తెలపడానికి ఆయన అభిమానులు వందల సంఖ్యలో బయలుదేరారు. తిరుపతి నుంచి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, రైతులు, ప్రజా ప్రతినిధులు ఢిల్లీకి వెలుతున్నట్లు తెలిపారు.

తమది బల ప్రదర్శన కాదని, కేవలం రైతుల సమస్యలను పరిష్కరించాలని సర్కార్‌పై తెస్తున్న వొత్తిడని జగన్‌ అనుచరుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం చలి తీవ్రంగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కార్యకర్తలకు నేతలు విజ్ఞప్తి చేశారు

No comments:

Post a Comment