Saturday, January 8, 2011

జగన్ పై పోటీకి నేను సిద్ధం : డీ యల్ రవీంద్ర



హైదరాబాద్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై తాను పోటీకి సిద్ధమని వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. కడపలోనే తేల్చుకుందామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వైయస్ జగన్‌ను సవాల్ చేశారు. తాను రాజీనామా చేసి వైయస్ జగన్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. వైయస్ జగన్ బ్లాక్ మొయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్సించారు. బ్లాక్ మొయిల్ చేసి శాసనసభ్యులను ఢిల్లీ దీక్షకు తీసుకుని వెళ్లాలని వైయస్ జగన్ చూస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ శాసనసభ్యులను కొంటున్నారని ఆయన ఆరోపించారు.

ధనమదంతో తన పత్రికలో వైయస్ జగన్ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయిస్తున్నారని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులు రాజీనామాలు చేసి, తిరిగి వైయస్ జగన్ పార్టీ కింద పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ గనుల తవ్వకాల్లో వైయస్ జగన్ పాత్ర ఉందని, కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రకటన ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని, తెలంగాణ కోసం శాసనసభలో తీర్మానం పెట్టాలంటే అందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment