అమెరికాతో వాణిజ్య ఒప్పందాల అనంతరం భారత్ కదలికల్లో మార్పువస్తోంది. భద్రతామండలి శాశ్వత సభ్యత్వం కోసం చిరకాల మిత్రులను పక్కన పెట్టే చర్యలకు భారత్ దిగుతోంది. ఇందులో భాగంగా ఇరాన్‌తో దోస్తీని వదులుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు చిరకాల స్నేహం, మరోవైపు పెద్దన్నలతో వ్యాపార ఒప్పందాలు..ఈ రెండింటి నడుమ దేశ చిరకాల వాంఛ.
ఎటువైపు ఎలా అడుగులు వేయాలో తెలియక కాలమే సమాధానం చెబుతుందన్నట్లు భారత్ మిన్నకుంటుంది. వందలఏళ్లుగా సన్నిహత సంబంధాలుండి, దేశీయంగా చమురు అవసరాలను తీరుస్తున్న ఇరాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఇప్పుడు అడుగులు వేస్తోంది. అణ్వస్త్రాల విషయంలో తన మాట వినని ఇరాన్ ను ఒంటరి చేయాలనే ఉచ్చులో భారత్ తన వంతు సహకారాన్ని అమెరికాకు అందిస్తోంది.
ఇరాన్ నుంచి దిగుమతయ్యే ముడి చమురు చెల్లింపులను డాలర్లు-యూరోల్లో జరపకూడదనే ఉద్దేశ్యంతోనే ఐరోపా-అమెరికా సమాజానికి భారత్ తలూపింది. ఏలానో చెప్పకుండా మరో రూపంలో చెల్లిస్తామంటూ ఇరాన్ తో ముక్తాయింపుగా భారత్ వ్యవహరిస్తోంది. దీనికి ఓ కారణం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం తహతహాలాడుతున్న భారత్ సందట్లో సడేమియా లాగా అమెరికా-ఐరోపా సమాజాల మెప్పుపొందేందుకు ప్రయత్నిస్తుంది.
గతంలో కాశ్మీర్ విషయంలో ఇరాన్ పాక్ కు వంత పాడగా.. అణ్వస్త్రాల విషయంలో ఇరాన్ కు భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇవేమి ఇండో-ఇరాన్ ల మధ్య వైరాన్ని పెంచలేదు. కాని చమురు చెల్లింపుల విషయంలో కాలక్షేపం చేస్తూ, కొత్తప్రతిపాదనలేవి తేకుండా భారత్ వ్యవహరిస్తున్న అంతర్జాతీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోంది.
సమితిలో శాశ్వత సభ్యత్వం దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నం తప్పుకాదు కాని అదే సమయంలో దేశీయంగా అవసరాలు తీరుస్తున్న ఇరాన్‌తో వైరం పెంచుకోవడం ఎలాంటి ఉపద్రవానికి దారి తీస్తుందోనని ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశీయంగా ఉత్పత్తి అవుతున్న చమురును అగ్రదేశాలు ఎగుమతి చేసుకోలేకపోతే ఎక్కువగా నష్టపోయోది ఇరానే నని మేథావి వర్గం అంచనావేస్తున్నారు. ఏది ఏమైనా ఒబామా పర్యటన అనంతరం భారత్ కదలికల్లో మార్పు వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment