Thursday, January 6, 2011

శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు పై భిన్న అభిప్రాయాలు

  AA
శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుతో రాష్ర్ట నేతల వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపించట్లేదు. ప్రధాన పార్టీల నాయకులు చాలా వరకు ప్రాంతాలవారిగా పాత వైఖరులనే పునరుద్ఘాటి స్తున్నారు. ఒక ప్రాంతంవారు స్వాగతిస్తుండగా, మరొక ప్రాంతంవారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక బహిర్గతం కావడంతో అధికారపార్టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నివేదికను అద్యయనం చేసేపనిలో పడ్డారు.

కమిటీ చేసిన సూచనలను ఎవరికి వారే తమతమ ప్రాంతాలకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భవిష్యత్‌ కార్యక్రమంపై చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రా న్ని సీమాంద్ర ,తెలంగాణ గా విభజించాలన్న కమిటీ సూచించిన అంశం మాత్రమే తమకు పూర్తిగా అంగీకారమని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిర్ణయానికి కొచ్చారు.

అధిష్టానం ఈ సూచనకు అనుగుణంగానే నిర్ణయం తీసుకోవాలని వారు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు కోస్తాంద్ర కాంగ్రెస్ నేతలు శ్రీకృష్ణ కమిటి నివేదిక మొత్తాన్ని తాము స్వాగతిస్తున్నామని అంటున్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని తమ పార్టీ ఒక్కటే భుజాన వేసుకోనవసరం లేదని, అన్ని పార్టీలతో చర్చించి ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమే నని అంటున్నారు.

మరోవైపు రాయల సీమ నేతలు మాత్రం ఉంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలి లేదంటే రాయల తెలంగాణ కావల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. కమిటీ నివేదిక లోని అంశాలనతో ఎవరూ నిరుత్సాహ పడనవసరం లేదని మాజీమంత్రి జేసి.దివాకర్‌ రెడ్డి అంటున్నారు. శ్రీకృష్ణ కమిటి నివేదిక పై మరోసారి చర్చించడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఇవాళ సమావేశమవుతారు. ఇక టీడీపీ నేతల వైఖరి కూడా కాంగ్రెస్‌ నేతల తీరుకు ఏమాత్రం భిన్నంగా లేదు.

నివేదికపై తమకు నమ్మకం లేదని మొదటినుండీ చెప్తున్న తెలంగాణా టీడీపీ నేతలు ఇప్పుడూ అదే అంటున్నారు. రెండు, ఐదు మినహా మిగిలిన అంశాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టించి తెలంగాణా సాధించేవరకూ పోరాడుతామని పునరుద్ఘాటిస్తున్నారు. మరోవైపు, రిపోర్టుపట్ల సీమాంధ్ర టీడీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా భిన్నరూపాల్లో స్పందించారు. నివేదిక రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్ధం పట్టిందని కొందరంటుండగా అస్పష్టంగా వుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

నివేదికలోని ఆరవ సిఫార్సువైపు వారు మొగ్గుచూపుతున్నారు. ఇక ఈ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం ఎప్పటి లాగే బంతిని కాంగ్రెస్‌ కోర్టులో వేసినట్టు తెలుస్తోంది. నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకోవాల్సింది, ఏమి చేస్తారో ముందు చెప్పాల్సింది కేంద్రం, అధికార పార్టీయేనని అన్నట్టు సమాచారం.

No comments:

Post a Comment