' సీఎం'ను కలిసిన 'తెలంగాణ నేతలు'
తెలంగాణ ప్రజాప్రతినిధులు సచివాలయంలో సీఎంను కలిశారు. మీడియాపై ఆంక్షాలను ఎత్తివేయాలని, భారీగా మోహరించిన పోలీసు బలగాలను వెంటనే విరమించుకోవాలని కోరారు. అలాగే ఓయూలో జరుగుతున్న పరిణామాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులపై పోలీసులు దురుసుగా వ్యవహరించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే, మీడియాపై ఆంక్షలు కేంద్ర స్ధాయిలో జరిగిందని...త్వరలో పరిస్థితిని చక్కదిద్దుతామని సీఎం చెప్పినట్లు తెలంగాణా కాంగ్రెస్ నేతలు తెలిపారు.
బిల్లు పెట్టకుంటే ' రాజీనామాలకు సిద్ధం '
గులాంనబీ తో భేటి అయిన సీఎం .
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి గులాంనబి ఆజాద్ తో సమావేశం అయ్యారు. లేక్వవ్యూ గెస్ట్హౌసులో అరగంట పాటు వీరి చర్చ జరిగినట్లు సమాచారం.ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గులాంనబీ హైదరాబాద్ వచ్చారు.గురువారం ఆజాద్ లేక్వ్యూ అతిదిగ్రుహం లో బస చేసారు.రాత్రి డిల్లి నుంచి హైదరాబాద్ వచ్చిన సీఎం ,ఈ ఉదయం ఆయన్ను కలిసారు.సుమారు అరగంటకు పైగా వారు మంతనాలు సాగించారు,శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వెల్లడైన నేపధ్యంలో రాష్ట్రం లో నెలకొన్న పరిణామాల పై వారు చర్చారు.ముఖ్యం గా తెలంగణ రాష్ట్రం ఇస్తే జరిగే పరిణామాల పై చర్చినట్లు సమాచారం.