| | ||
న్యూఢిల్లీ: మాజీ టెలికం మంత్రి ఎ. రాజా జమానాలో జరిగిన 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి, టెలికం మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. కాగ్ నివేదికను కపిల్ సిబల్ ఎలా తప్పు పడుతారని, కాగ్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయాలని సివిసి సిబిఐని ఆదేశించిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. రాజా హయాంలో జరిగిన 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి, న్యాయవాది ప్రశాంత్ భూషన్ ఆ పిటిషన్లను దాఖలు చేశారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్వామి విజ్ఞప్తిని గత వారం సుప్రీంకోర్టు సమర్థించింది.
No comments:
Post a Comment