అవినీతి ప్రక్షాళనకు కేంద్రం కసరత్తు
అవినీతి, కుంభకోణాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వం మంత్రిమండలిని విస్తరించే ఆలోచనల్లో ఉంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే కెబినెట్ విస్తరణ చేసే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రిమండలిలో రెండు మూడు రోజుల్లో భారీ మార్పులు, చేర్పులు జరుగనున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే మంత్రి వర్గ విస్తరణ జరుగవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
యూపీఏ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అవినీతి...కుంభకోణాలతోపాటు...కొన్ని రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలే మంత్రి వర్గ విస్తరణకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇందులో మన్మోహన్ సర్కార్‌లో వివిధ కారణాలతో ఖాళీ అయిన శాఖలను భర్తీ చేయనున్నారు. అవినీతిని అడ్డుకోవాలంటే యువతకు అవకాశాలు ఇవ్వాలని ప్రధాని మన్మోహన్ సింగ్ భావిస్తున్నారు.
మాజీ మంత్రి శశీథరూర్ అధికార దుర్వినియోగం ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేయగా...కేంద్ర మంత్రిగా ఉన్న పృద్వీరాజ్ ఛౌహాన్ మహారాష్ట్ర ముఖ్యంత్రిగా బాధ్యతలు స్వీకరించటం....వీరితోపాటు 2 జీ స్పెక్ట్రం కుంబకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టెలికం మినిస్టర్ ఏ రాజా కేబినెట్‌కు రాజీనామ చేశారు.
మరోవైపు రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని చూస్తున్న కేంద్ర మంత్రి అలిగిరి సైతం తన రాజీనామా లేఖను తండ్రి కరుణానిదికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ శాఖలను భర్తీ చేయడంతో పాటు కొందరి శాఖల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీపీ జోషీలను ఆ శాఖల నుంచి తప్పించి వేరే శాఖలు అప్పగించే అవకాశముంది.
ఇక పోతే వాణిజ్య, పరిశ్రమల సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విదేశాంగ సహాయ మంత్రి బాధ్యతలను అప్పగించనున్నారు. ఇప్పటికే మూడు శాఖలు నిర్వహిస్తున్న వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌కు ఆహార, ప్రజాపంపిణీ శాఖను, పార్లమెంటరీ వ్యవహారాల శాఖను ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌కు అప్పగిస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో వీరి స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు.
No comments:
Post a Comment