సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘నరసింహా’ చిత్రం ఒక్కసారి గుర్తు చేసుకుటే మీ అందరికీ ఆ చిత్రంలో హీరోయిన్‌గా, విలన్‌గా నటించిన రమ్యకృష్ణ తప్పకుండా గుర్తుకు వస్తుంది కదూ. సరిగ్గా అలాంటి క్యారెక్టర్‌లో నటించాలనే కోరికతో రగిలిపోతుంది అందాల హాట్ బ్యూటీ ప్రియమణి. ఇటీవల ఓ సందర్భంలో ప్రియమణి మాట్లాడుతూ.. ‘2010లో నేను నటించిన ‘రక్తచరిత్ర, రావణ్, రగడ’ వంటి చిత్రాలు కలిసిరాలేదు.
అయితే నా పాత్రలకు మాత్రం మంచి పేరు వచ్చింది అంటూ.. మంచి లెడీ ఓరియంటెడ్ కథ వుంటే నేను నటించడానికి సిద్ధంగా వున్నాను. రెమ్యునరేషన్ విషయంలో కూడా నేను పెద్దగా పట్టించుకోను’’ అని అంటోంది. దర్శక, నిర్మాతలు ఈ విషయంలో కాస్త ఆలోచించంటి మరి.
No comments:
Post a Comment